News

శ్రీరాముని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

391views

నూతన సంవత్సరం సందర్భంగా అయోధ్యలో రోజంతా భక్తుల సందడి కనిపించింది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని, శ్రీరాముని దర్శించుకున్నారు.

ప్రస్తుతం అయోధ్యను సుందరంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.నూతన సంవత్సరం సంద్భంగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో నాలుగు వేదాలలోని అన్ని శాఖల పారాయణం, యాగం నిరంతరం కొనసాగుతున్నాయి.