News

ఏకకాలంలో 4 గగనతల లక్ష్యాల ఛేదన : డీఆర్‌డీవో

364views

పాతిక కిలోమీటర్ల పరిధిలోని 4 గగనతల లక్ష్యాలను ఒకే ఫైరింగ్‌ యూనిట్‌ ద్వారా ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకున్న తొలి దేశంగా భారత్‌ అవతరించిందని ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)’ ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. వాయుసేన ఈ నెల 12న నిర్వహించిన ‘అస్త్రశక్తి’ మిలిటరీ విన్యాసాల్లో.. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థ సంబంధిత సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించినట్లు తెలిపింది.