News

శ్రీకాళహస్తిలో ఆగమోక్తంగా ఆకాదీపం

252views

జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం ఆకాదీపాన్ని ఆగమోక్తంగా వెలిగించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తిక మాసం పురస్కరించుకుని ప్రతిరోజు ఆకాశదీపాన్ని సంప్రదాయబద్ధంగా వెలిగిస్తుంటారు. ఆలయంలోని ఊంజల్‌సేవ మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్తీక దీపానికి పూజలు చేశారు. అనంతరం స్థూపానికి జ్యోతిని అమర్చి ఆకాశదీపంగా ఎగురవేశారు. భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు.