News

శ్రీపద్మావతి అమ్మవారి సేవలో వ్యాసరాజ మఠాధిపతి

149views

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని గురువారం కర్ణాటకలోని వ్యాసరాజ మఠాధిపతి శ్రీవిద్యాదీశతీర్థ స్వామీజీ తన శిష్య బృందంతో కలసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ డిప్యూటీ ఈఓ గోవిందరాజన్‌ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద మొక్కుకుని, అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబు స్వామి, సుభాస్కర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.