News

బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధిస్తాం – గవర్నర్ త్రిపాఠీ

772views

న్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ లో  అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శ్రేణులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇప్పటికే పోలీసు స్టేషన్లలో చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక శనివారం జరిగిన హింసలో నలుగురు మృతి చెందినట్టు ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో కేంద్ర హోంశాఖ కు పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి రాష్ట్ర పరిస్థితులపై నివేదిక అందించారు. పశ్చిమ బెంగాల్ లో పరిస్థితి మరీ దిగజారితే రాష్ట్రపతి పాలన విధించక తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనల్లో ఇప్పటివరకు 12 మంది మరణించారని, అల్లర్లు మరింత పెచ్చరిల్లితే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

కేసరీనాథ్ త్రిపాఠీ సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసరీనాథ్ త్రిపాఠీ ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి. త్రిపాఠీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు వివరించానని తెలిపారు.