News

పాఠ్యపుస్తకాల్లో హిందూ వ్యతిరేక భావాలను ఖండిస్తూ తెలంగాణలో టీచర్ల ఫిర్యాదు

281views

తెలంగాణ స్టేట్ బోర్డ్ సిలబస్‌లో భాగంగా 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో కృష్ణుడికి సంబంధించిన ఒక ప్రకరణము తీవ్ర విమర్శలకు దారి తీసింది. కృష్ణుడిని పూజించడం వల్ల గ్రామస్తులు ఇక్కట్ల పాలయ్యారనే అర్థం వచ్చేలా ప్రకరణము ఉండడంతో ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది. హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్న ఈ ప్రకరణమును వెంటనే తొలిగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రీజియన్ టీచర్స్ అసోసియేషన్(TAPAS) ఎస్‌సీఈఆర్‌టీకి ఫిర్యాదు చేసింది. పాఠ్యపుస్తకం రూపొందించిన కమిటీలో ముస్లిం ప్రొఫెసర్ తహసీన్ సుల్తానా సమస్వయకర్తగా ఉండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ప్రకరణమును తొలిగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రీజియన్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేదంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించింది. కృష్ణ భగవానుడిని పూజించడం వల్ల గ్రామస్తులు సమస్యలు ఎదుర్కొన్నారని సందేశం ఇవ్వడం పరోక్షంగా నాస్తికతను విద్యార్థుల మెదడుల్లో జొప్పించడమే అని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలపై దాడులు, పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం తరచుగా వెలుగుచూస్తున్నాయి. సనాతన ధర్మంపై విషం కక్కడం సాధారణ విషయంగా మారింది. ఇలాంటి అనుచిత చర్యలకు ప్రభుత్వమే అడ్డుకట్ట వేయాలని హిందువులు కోరుతున్నారు.