News

గోవులతో తొక్కించుకున్న భక్తులు

304views

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని సమీపం బిధావత్‌ గ్రామంలో భక్తులు నేలపై పడుకొని గోవులతో తొక్కించుకున్నారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు తీరుతాయని పేర్కొన్నారు. గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారని.. అందుకే వాటితో తొక్కించుటామని భక్తులు చెబుతున్నారు. దీపావళి రోజు ఉదయం గ్రామస్థులు గోవులకు పూజలు చేశారు. ఆ తర్వాత వాటన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చారు. డప్పులతో భక్తులు గ్రామమంతా ప్రదక్షిణలు చేశారు. అనంతరం పురుషులు నేలపై పడుకుని.. గోవులతో తొక్కించుకున్నారు. ‘అబద్ధం చెప్పేవారి పైనుంచి ఆవులు నడుస్తాయని నమ్ముతాం. ఈ సంప్రదాయం చాలా ఏళ్లుగా మా గ్రామంలో ఉంది’ అని స్థానికులు తెలిపారు.