
ఈ ఏడాది చివరికల్లా రెండు పెద్ద రాకెట్ ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రో తెలిపింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ-ఎంకే2 ప్రయోగాలకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌పోశాట్ ప్రకాశవంతమైన ఖగోళ ఎక్స్‌రే మూలాలకు సంబంధించిన వివిధ డైనమిక్‌లను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మొట్టమొదటి మిషన్ అని జీఎస్‌ఎల్‌వీ ద్వారా ఇన్‌శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. ఇది వాతావరణ సేవలను అందించనుందని పేర్కొన్నారు. జీఎస్‌ఎల్‌వీ-ఎంకే2 ప్రయోగం చాలా ముఖ్యమైనదని.. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీతో కలిసి దీనిని అభివృద్ధి చేయనున్నారని వీటికి సంబందించిన వైబ్రేషన్ పరీక్షలు ప్రారంభమయ్యాయని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.





