News

ఆవుపేడతో 1.51 లక్షల ప్రమిదలు, అయోధ్యలో మహాదీపోత్సవం కోసం తయారీ

292views

అయోధ్యలో జరుగుతున్న మహా దీపోత్సవ్ కార్యక్రమంలో రామ్ కీ పౌరిలో మొత్తం 21 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఈ 21 లక్షల దీపాలలో 1,51,000 దీపాలను ఆవు పేడతో తయారు చేసినవి కావడం విశేషం.

ఉత్తరప్రదేశ్‌లోని పశుసంవర్ధక శాఖ మంత్రి ధరంపాల్ సింగ్ తన శాఖలో తయారు చేసిన ఈ దీపాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆయన నివాసంలో బహుకరించారు. అయోధ్యలో జరుగుతున్న దీపాల పండగలో కూడా ఈ గోదాప్రియులు పాల్గొంటున్నారు.

ఈ ఏడాది దీపావళి రోజున లక్ష్మీ గణేశుడిని గోదీపాన్ని వెలిగించి పూజించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులందరికీ పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి ధరంపాల్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఆవు పేడతో తయారు చేసిన దీపాలను మాత్రమే వినియోగించాలని మంత్రి సామాన్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారతీయ సంస్కృతి, విశ్వాసం ప్రకారం గోవును పూజించదగినదని, చూడదగ్గదని అందుకే దీన్ని గోమాత అని పిలుస్తారని చెప్పారు.

ఆవు పేడలో లక్ష్మీదేవి నివసిస్తుందని, ఆవు మూత్రంలో గంగామాత ప్రవహిస్తుందని మంత్రి ధరంపాల్ సింగ్ తెలిపారు. ఆవు పాలు అమృతం అని, అందుకే దీపావళి రోజున మట్టి దీపాలతో పాటు పవిత్రమైన ఆవు పేడతో చేసిన దీపాలను వెలిగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.దీపావళికి చాలా ముందుగానే పశుసంవర్ధక శాఖ గోదీపాల తయారీకి సన్నాహాలు ప్రారంభించింది. ఆవు పేడతో తయారు చేసిన గోదీపాలను తయారు చేయాలని, తద్వారా అత్యధిక మందికి అందజేయాలని, దీపావళి సందర్భంగా వినియోగించేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. అందుకే అయోధ్య దీపోత్సవ్ కార్యక్రమంలో సీఎం యోగికి లక్షా యాభై ఒక్క వేల దీపాలను సమర్పించారు.