
దేశ వ్యాప్తంగా ఉన్న సరిహద్దు ప్రాంతాల భద్రత దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు, విద్య, భద్రత, స్వావలంబన, పౌర విధులకు సంబంధించి సీమ జాగరణ్ మంచ్ ద్వారా కృషి చేస్తామని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక పౌర, భద్రతా బలగాలతో సమన్వయం పెంచేందుకు కూడా ప్రత్యేక కృషి చేయనున్నట్లు తెలిపారు. అఖిల భారతీయ కార్యకారి మండల్ బైఠక్ గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే విలేకరుల సమావేశంలో వివరించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారి మండల్ బైఠక్ మంగళవారం ముగిసింది. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల నుంచి 357 మంది ప్రతినిధులు, సంఘచాలక్‌లు, కార్యవాహులు, ప్రచారక్‌లు, అఖిల భారత కార్యనిర్వాహక సభ్యులు సహా మరియు పలు సారూప్య సంస్థల నుంచి ఎంపిక చేసిన సంస్థ ప్రతినిధులు, పలువురు కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశం చివరి రోజు జరిగిన విలేకరుల సమావేశంలో సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే జీ మాట్లాడుతూ.. భారతీయుల జీవితాల్లో జాతీయ గుర్తింపు కోసం పెద్ద ఉద్యమమే జరిగిందన్నారు. శ్రీరామ జన్మభూమి ఆలయ పనులు దాదాపు పూర్తయ్యాయని… జనవరి 22న నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీరాంలల్లా ప్రాణ ప్రతిష్ట జరగనుందని తెలిపారు.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర గౌరవనీయులైన సర్ సంఘ్ చాలక్ జీ మరియు ప్రధానమంత్రిని ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ చారిత్రాత్మక ఘట్టానికి ప్రజలు సాక్షులుగా ఉండేలా, జనవరి 1 నుండి జనవరి 15 వరకు స్వయంసేవకులు శ్రీ రామ జన్మభూమి తీర్థం అందించిన అక్షతతో శ్రీ రామ్ లల్లా చిత్రాలను దేశవ్యాప్తంగా ప్రజలను ఆహ్వానిస్తూ ఇంటింటికీ సంపర్క్ అభియాన్ నిర్వహిస్తారని తెలిపారు.

శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామాజిక సమరసత, కుటుంబ ప్రభోదం, పర్యావరణ పరిరక్షణ, గో సేవ, పౌరుల బాధ్యత వంటి అంశాలపై చర్చ జరిగిందని ఈ అంశాలను సమాజం ముందుంచేందుకు కృషిచేస్తామన్నారు. మొదట ఈ అంశాలను స్వయం సేవకులు శాఖా స్థాయిలో అమలు చేయాలన్నారు.సామాజిక సమరసత ద్వారా సమాజాన్ని ఏకం చేయడానికి, పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం, పాలిథిన్ వాడకాన్ని తగ్గించడం మరియు నీటి సంరక్షణ వంటివి చేపట్టి కుటుంబ ప్రభోదన్ ద్వారా సాంస్కృతిక విలువలను తరువాతి తరానికి అందించాలని తెలిపారు. రాజస్థాన్ లో మూడింట ఒక వంతు ఉన్న జోధ్ పూర్ ప్రాంతంలో స్వయం సేవకులు 14 వేల కిలోమీటర్లు ప్రయాణించి 15 లక్షల చెట్లను నాటారని… కర్ణాటకలో సీడ్ బాల్ పద్ధతిలో కోటి మొక్కలను నాటేలా ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. దేశంలోని పౌరులందరి జీవనశైలి స్వదేశీయంగా ఉండాలని, పౌర విధులను పాటిస్తూ తమ జీవితాల్లో క్రమశిక్షణను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
సంఘ్ శిక్షణా తరగతులను మార్చామని, ఇందులో యువకులు, పెద్దలు సహా ప్రతి వయస్సు వారికి వేర్వేరుగా పాఠ్యాంశాలు ఉంటాయన్నారు.మేధో పరంగా సామాజిక జీవితంలోని వివిధ రంగాలలో ప్రత్యక్షంగా సహకరించేలా ఆచరణాత్మక శిక్షణ ఇవ్వనునట్లు వివరించారు.
ఇతర అంశాలపై కూడా సమావేశంలో చర్చించామని తెలిపారు.సంఘ్ లో రెండు రకాల పనులు ఉన్నాయని.. ఒకటి శాఖ ఆధారితమైనదని అన్నారు. సమాజంలో వ్యక్తిత్వ నిర్మాణాన్ని నిర్మించే పనిని 98 సంవత్సరాలుగా సంఘ్ చాలా పట్టుదలతో నిర్వహిస్తోందన్నారు. వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా దేశం కోసం నిలబడే వ్యక్తులు ప్రతి ప్రాంతంలో తయారవుతారని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 95,528 రోజువారీ మరియు వారపు శాఖలను నిర్వహిస్తునట్లు తెలిపారు. శతాబ్ది సంవత్సరం నాటికి దేశంలోని 59,060 మండలాలకు సంఘ్ పనిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సాధారణంగా, స్వయం సేవకులకు సంఘ్‌లో సభ్యత్వం ఉండదని.. అన్ని వయసుల వారు శాఖకు వస్తారని తెలిపారు. ఈ సంవత్సరం 37 లక్షల మంది స్వయం సేవకులు గురుపూజలో పాల్గొన్నారని వెల్లడించారు.
కార్యకారి మండల సమావేశం సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుందని, ఒకటి మార్చి నెలలో అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS), రెండవది అఖిల భారతీయ కార్యకారి మండల్ (ABKM) దసరా దీపావళి మధ్య జరుగుతుందని ఆయన తెలిపారు.
కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. సమాజ సహకారంతో స్వయంసేవకుల కృషి ఇప్పటికీ నిరంతరంగా కొనసాగుతోందన్నారు. సౌరాష్ట్ర – కచ్‌లోని స్వయంసేవకులు అస్సాం, త్రిపురలో అమలులో ఉన్న పథకాలలో సహాయం చేస్తున్నారని, ఇది తూర్పు, పడమర కలిపే ఈ పని ముఖ్యమైనదన్నారు.
విలేకరుల సమావేశంలో అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ జీ, అఖిల భారతీయ సాహ ప్రచార ప్రముఖ్ నరేంద్ర ఠాకూర్ జీ, అఖిల భారతీయ సహ ప్రచార్ ప్రముఖ్ అలోక్ కుమార్ జీలు పాల్గొన్నారు.




