
అన్నవరం వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ధి పనులపై ఈవో ఆజాద్, సభ్యులు చర్చించారు. అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. అన్నవరం దేవస్థానం రూ.800 వ్రత టికెట్టును రూ.వెయ్యికి పెంచుతూ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. కార్తిక మాసంలో సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తుల రద్దీ, ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నీటిపారుదల, విద్యుత్తు, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, మత్స్య, ఆర్టీసీ తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. కార్తీక మాస పర్వదినాల్లో ఏరోజు ఎందరు భక్తులు వస్తారో అంచనా వేసి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబరు 4న సత్యదీక్ష విరమణ రోజున మాలధారణ చేసిన భక్తులంతా గిరిప్రదక్షిణ చేసేలా ప్రణాళిక రూపొందించామని ఆలయ ఈవో తెలిపారు.





