News

పర్యాటక ఆకర్షణకు తిరుపతిలో హెలికాప్టర్‌ రైడ్ ప్రారంభం ఒక్క రైడ్‌కు..

309views

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు శుభవార్త. తిరుపతిలో హెలికాప్టర్ రైడ్‌ ప్రారంభమైంది. చెన్నైకు చెందిన ఏరో డాన్ ఏవియేషన్ సంస్థ నిర్వాహకులు..తిరుపతి తుమ్ములగుంట క్రికెట్ స్టేడియం నుంచి దీన్ని ప్రారంభించారు. ఈ హెలికాప్టర్ రైడ్ ద్వారా తిరుపతి శేషాచల అందాలను, తిరుపతి పరిసరాలు వీక్షించేందుకు రూ. 6 వేలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్యాకేజీ రూపంలో కూడా బుక్ చేసుకోవచ్చు అని నిర్వాహకులు తెలిపారు. స్థానికులతో పాటూ భక్తులు కూడా ఈ రైడ్ ఎంజాయ్ చేయొచ్చంటున్నారు