News

ప్రపంచమంతా ఒకటే మతం : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్‌ భాగవత్‌

319views

ఈ భూమిపై విభిన్న వర్గాలు, ఉపవర్గాలు ఉండొచ్చు తప్ప ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది ఒకటే మతమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ – ఆరెస్సెస్‌ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా.మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌ జిల్లా సర్‌సావా పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో జరిగిన ఓ భూమి పూజ కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘యావత్‌ ప్రపంచ మతం ఒక్కటే. మతాన్ని వివిధ సందర్భాల్లో పలు విధాలుగా పేర్కొన్నారు. ప్రతివారు విభిన్నంగా కనిపించినా వారందరి మతం ఒక్కటే. అందరి లక్ష్యం ఒక్కటే. మనమంతా ఒక్కటే. ఒక్కటిగా ఉందాం’’ అని స్పష్టం చేశారు.