News

నిజరూపంలో దర్శనమిచ్చిన భ్రమరాంబాదేవి

252views

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు మంగళవారం ఉదయం ఈవో డి.పెద్దిరాజు, ఆలయ అర్చకులు, వేదపండితులు, ధర్మకర్తలు శాస్త్రోక్తంగా ఉత్సవాలకు పూర్ణాహుతి నిర్వహించారు. రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి నిజరూప అలంకారంలో దర్శనమిచ్చారు. భ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నంది వాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు చేశారు. మంగళవాద్యాల నడుమ స్వామి, అమ్మవార్లకు ఆలయ ఉత్సవం నిర్వహించి, శమీ పూజ జరిపించారు. చివరగా తెప్పోత్సవం నిర్వహించారు. ముస్తాబు చేసిన తెప్పపై ఆదిదంపతులు విహరించారు.