News

పఠాన్‌కోట్‌ సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ కాల్చివేత..

266views

పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి, భారత్‌ మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది షాహిద్‌ లతీఫ్‌ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ లో సభ్యుడైన 41 ఏండ్ల లతీఫ్‌.. 2016, జనవరి 2న జరిగిన పఠాన్‌కోట్‌ దాడికి వ్యూహరచన చేశాడు. దానిని అమలు చేయడానికి సియాల్‌కోట్‌ నుంచి నలుగురు ఉగ్రవాదులను పంపించాడు.

కాగా, 1994, నవంబర్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద లతీఫ్‌ను పోలీసులు భారత్‌లో అరెస్టు చేశారు. 2010లో జైలు నుంచి విడుదలైన అతడు.. వాఘా సరిహద్దుల మీదుగా పాకిస్థాన్‌కు పరారయ్యాడు. అనంతరం జైషే మహమ్మద్‌లో చేరిన అతడు భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. 1999లో జరిగిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం హైజాక్‌లో అతడు నిందితుడిగా ఉన్నాడు. అయితే నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అతడిని మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్టుగా ప్రకటించింది