News

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నిర్ణయాలు

342views

తిరుమల అన్నమయ్య భవనంలో ముగిసిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశం.ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయాలను మీడియాకు వివరించిన ఛైర్మన్ కరణాకరరెడ్డి.

అలిపిరి గోశాలలో శ్రీ శ్రీనవాస అనుగ్రహ విశేష హోమం అనే పేరుతో యజ్ఞం.

తితిదే లో పనిచేస్తున్న పారిశుద్ద్యా కార్మికుల జీతం రూ. 12 వేలు రూ. 17 వేలకు పెంపు.

శ్రీ లక్ష్మి శ్రీనివాస కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 3 శాతం జీతం పెంపు.

శ్రీ లక్ష్మి శ్రీనివాస కార్పొరేషన్ ఉద్యోగులు మరణిస్తే 2 లక్షల ఎక్స్ గ్రేషియా.

గోగర్భం జలాశయం నుంచి ఔటర్ రింగు రోడ్డులో శాశ్వత క్యూ లైన్ల ఏర్పాటుకు రూ.18 కోట్లు.

భక్తులకు నాణ్యమైన భోజనాలు అందించేందుకు నారాయణ గిరి,అన్నమయ్య భవనాల్లో హోటళ్లను టూరిజం శాఖకు అప్పగింత

వేణుగోపాల స్వామి,జపాలి,ఆకాశ గంగ ఆలయాలకు వెళ్లే మార్గంలో రోడ్డు విస్తీరణ కోసం రూ. 40 కోట్లు

తితిదే తిరుపతిలో పారిశుద్ధ్యం మెరగపరిచేందుకు నిర్ణయం.

తితిదే సీఎస్అర్ డబ్బులు నుంచి ప్రతి సంవత్సరం 1 శాతం నిధులు కేటాయింపు.

తిరుమల తిరుపతి ఆలయాల రాజ గోపురాల భద్రత కోసం నిపుణుల కమిటీ