News

హిందువులను విభజించేందుకు కుట్ర, కాంగ్రెస్‌ కుల గణన డిమాండ్‌పై ప్రధాని మోదీ నిప్పులు

298views

జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ వంకతో హిందువులను విభజించేందుకు, తద్వారా దేశాన్ని నాశనం చేసేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ‘కుల గణన చేపట్టి జనాభా ఆధారంగా వనరులను పంచాలనడంలో కాంగ్రెస్‌ ఉద్దేశం ఏమిటి తద్వారా ముస్లింలు, మైనారిటీల హక్కులను తగ్గించాలనుకుంటోందా? దేశంలో ఎవరి జనాభా ఎక్కువగా ఉంది? అత్యధిక జనాభాగా ఉన్న హిందువులే ముందుకొచ్చి హక్కులన్నీ తమకే కావాలని డిమాండ్‌ చేయాలా? కాంగ్రెస్‌ ఆశిస్తున్నదేమిటి?‘ అని మండిపడ్డారు.
కాంగ్రెస్‌ కేవలం ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం కులం, మతం ఆధారంగా సమాజాన్ని విడదీయాలని చూస్తోంది‘ అని దుయ్యబట్టారు.