News

వైభవంగా సీతారామ స్వామి కల్యాణోత్సవం

182views

నూజివీడు మండలంలోని దిగవల్లి సీతారామ స్వామి కల్యాణోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామివార్లకు వేదపండితులు కల్యాణ క్రతువు నిర్వహించారు. యలమంచలి వెంకటమధుసూదన్‌రావు, సుబ్బారావు, బృందావనం మాధవశర్మ దంపతుల ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంగళవాయిద్యాలతో తీర్ధపుబిందె, నిత్యార్చన, నిత్యహోమం, శ్రీరామంజనేయ మూలమంత్ర హవనము, బలిహరణ అనంతరం తీర్ధప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు విశేషసంఖ్యలో కల్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా గురువారం అన్నసమారాధన జరిగింది.