News

సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలుకు ముహూర్తం ఖరారు

217views

సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ పట్టాలెక్కనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇది రెండో వందేభారత్ కానుంది. వారంలో మంగళవారం మినహా ప్రతీ రోజు ఈ రైలు రాకపోకలు ఉంటాయి. సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలు నెంబర్ 20701గా నిర్ణయించారు.

ఈ రైలు ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ లో బయల్దేరి నల్గొండ కు 07.19కి, గుంటూరుకు 9.45, ఒంగోలుకు 11.09, నెల్లూరుకు 12.29 చేరుకొని..అక్కడ నుంచి మధ్నాహ్నం తిరుపతికి 14.30 చేరుకుంటుంది. సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ వందేభారత్‌ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ. 2వేలు పైగా ఉండే అవకాశం ఉంది. ఏసీ చైర్ కారు రూ. 1150గా ఉంటుందని సమాచారం.

తిరుగు ప్రయాణంలో భాగంగా.. తిరుపతి టు సికింద్రాబాద్ వందేభారత్ సర్వీసు నెంబర్ 20702 గా నిర్ణయించారు. ఈ రైలు తిరుపతిలో మధ్నాహ్నం 15.15కి బయల్దేరి..నెల్లూరుకు సాయంత్రం 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండకు 22.10, సికింద్రాబాద్ కు రాత్రి 23.45కి చేరుకుంటుంది.