
216views
అమెరికా- చైనా మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో యాపిల్ ఫోన్ల తయారీ కంపెనీని భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. దీంతో భారత్‌కు మరో యాపిల్ ఫోన్ల తయారీ యూనిట్ రానుంది. కర్ణాటకలో ఏర్పాటు చేయనున్న ఈ ఫ్యాక్టరీ కోసం ఫాక్స్‌కాన్ కంపెనీకి బెంగళూరు శివార్లలో 300 ఎకరాలు కేటాయించినట్టు కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం తెలిపారు. ఈ యూనిట్ ద్వారా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఫాక్స్‌కాన్‌కు భారత్‌లో ఇది రెండో యూనిట్. ఈ సంస్థ ఇప్పటికే తమిళనాడులో ఐఫోన్లను తయారు చేస్తోంది.




