News

కాంతారా చిత్రాన్ని వీక్షించిన నిర్మలా సీతారామన్

380views

బెంగళూరు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాంతారా చిత్రాన్ని వీక్షించి, ప్రశంసలు కురిపించారు. సినిమా చాలా బాగుందంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. బెంగళూరులో తన వాలంటీర్లు, శ్రేయోభిలాషులతో కలిసి బుధవారం థియేటర్ లో కాంతారా సినిమా చూసినట్టు వెల్లడించారు. తులువనాడు, కరావళి ప్రాంతంలోని సంప్రదాయాలకు కాంతారా ప్రతీకగా నిలిచిందని మంత్రి మెచ్చుకున్నారు. అక్కడి సంప్రదాయాలను చాలా బాగా చిత్రీకరించారని పేర్కొన్నారు. ఈ సినిమాను తెరకెక్కించిన రిషబ్ షెట్టిపై నిర్మలా సీతారామన్ పొగడ్తల వర్షం కురిపించారు. థియేటర్‌లో దిగిన ఫొటోను కేంద్రమంత్రి షేర్‌ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి