ArticlesNews

అమెరికాది ‘నెత్తుటి’ దాహం..! గంజాయి వనంలో ఉండలేనన్న ‘తులసి’..!!

457views

వాషింగ్టన్: తులసీ గబార్డ్.. ఈ పేరు భారతీయులకి పెద్దగా గుర్తుండకపోవచ్చు. కానీ, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి రాక ముందు.. డెమొక్రటిక్ పార్టీలో అంతర్గత పోటీ నెలకొంది. ఎవరు.. డొనాల్డ్ ట్రంప్‎తో వైట్‎హౌజ్ రేసులో పోటీ పడాలనే దానిపై డెమొక్రాట్స్‎లో చర్చ జరిగింది. అప్పుడు ప్రధానంగా వినిపించిన పేర్లలో తులసీ గబార్డ్ కూడా ఒకరు..!

తులసీ గబార్డ్ అమెరికాలోని ప్రకృతి అందాలకు నెలవైన హవాయి ప్రాంతానికి చెందిన వారు. ఆమె 21 ఏళ్ల వయస్సులో.. రాజకీయంగా ఎటువంటి కుటుంబ నేపథ్యం లేనప్పటికీ.. స్థానిక ఎన్నికల్లో పాల్గొన్నారు. అప్పుడే డెమొక్రటిక్ పార్టీలోనూ చేరారు. గత ఇరవై ఏళ్లుగా అదే పార్టీలో కొనసాగుతున్నారు. అమెరికన్ ఆర్మీలో వైద్య విభాగంలో పని చేసిన ఆమె.. ఇరాక్, కువైట్ వంటి దేశాల్లో యుద్ధ సమయాలప్పుడు కీలక సేవలు అందించారు..!

సహజంగానే జాతీయవాది, దేశభక్తురాలైన తులసీ.. అమెరికాలోని అత్యున్నత స్థానానికి పోటీపడిన హిందూ నేపథ్యం కలిగిన తొలి మహిళ..! ఆమె తాను గతంలో పదవిని స్వీకరించే సమయంలో కూడా భగవద్గీతపైన ప్రమాణం చేసిందని చెబుతుంటారు. అంతలా భక్తి, దేశభక్తి కలిగిన తులసీ గబార్డ్ డెముక్రటిక్ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. తన నిర్ణయం తెలుపుతూ.. దాదాపు ముప్పై నిమిషాల నిడివి ఉన్న వీడియో కూడా సొషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంతకీ, తులసీ గబార్డ్ నిరసన దేనికి..? చర్చిస్తే బోలెడు అంశాలే తెర మీదకు వస్తాయి..!

తన వీడియోలో, బ్లాగ్‎లో అనేక ఆసక్తికర, ఆందోళనకర విషయాలు బయటపెట్టిన తులసీ అన్నిటికంటే ప్రధానంగా డెమొక్రటిక్ పార్టీ అస్థిత్వం మీదే ప్రశ్నలు లేవనెత్తింది..? ఒకప్పుడు తాను చేరిన ప్రజాస్వామ్యబద్ధమైన డెమొక్రటిక్ పార్టీ వేరనీ.. ఇప్పుడున్న వారి ‘ఎలిటిస్ట్’ ఎజెండా వేరనీ… సూటిగా తేల్చి చెప్పింది. బాగా డబ్బు, వ్యాపారాలు ఉన్న అతి కొద్ది మంది సంపన్నుల సంక్షేమం కోసం పార్టీ పని చేస్తోందని మాజీ డెమొక్రాట్ ఆరోపించింది. అంతే కాదు, పార్టీలోని అతి కీలక వ్యక్తులు ఓ ముఠాగా మారి ప్రపంచంలో యుద్ధాలు చేయించటమే పనిగా పెట్టుకున్నారని తులసీ అన్నారు.

పార్టీ నుంచి వెళ్తూ.. వెళ్తూ.. మనందరికీ తెలిసిన చేదు నిజాన్ని మరోసారి తులసీ గబార్డ్ డెమొక్రాట్స్ దృష్టి కోణం నుంచి చెప్పింది. బయటి దేశాల వారికి అమెరికాలో రిపబ్లికన్స్ ఉన్నా, డెమొక్రాట్స్ ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. ప్రపంచపు పెద్దన్నగా దాదాగిరి చేయడం ఆ దేశానికి ఆయుధాలతో అబ్బిన విద్య..! కాబట్టి, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్దిక వ్యవస్థగా భారత్ మాత్రం ప్రస్తుతం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అమెరికాలోని డెమొక్రాట్ అధ్యక్షుడైన బైడెన్, అతని ప్రభుత్వం చేసే కుట్రలకు మనం ఎంత మాత్రం తత్తరపడకూడదు. చైనా, పాక్ లాంటి శత్రువుల మధ్య ఉన్న మనం.. అమెరికా ఏర్పరిచే ఏ ట్రాప్ లోనూ పడకూడదు. మోదీ నేతృత్వంలో జయశంకర్ ప్రస్తుతం ఆ పనిని జయప్రదంగానే చేస్తున్నారు..! తులసీ గబార్డ్ భవిష్యత్ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో.. చూడాలి మరి..!

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి