News

కేరళలో భాజపా అభ్యర్ధులకు పోలీసుల వేధింపులు – శబరిమల విషయంలో BJP అభ్యర్ధి 14 రోజుల రిమాండ్.

902views

కేరళలోని కోజిక్కోడ్ నియోజకవర్గ అభ్యర్ధి, కేరళ రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడు అడ్వకేట్ K.P. ప్రకాశ్ బాబుకు రన్ని జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ BJP నాయకుడు శబరిమల దేవాలయంలోనికి నిషేదిత మహిళల ప్రవేశం  విషయమై జరిగిన శాంతియుత నిరసన ప్రదర్శనలలో పాల్గొన్న దరిమిలా ఆయనపై పోలీసులు 8 కేసులు నమోదు చేశారు. ఆయన రేపు కోర్టుకు తన బెయిల్ పిటిషన్ సమర్పించనున్నారు.

పతనంతిట్ట BJP అభ్యర్ధి కె. సురేంద్రన్

ఇదే విధంగా పలువురు BJP నాయకులపై అప్పుడు పోలీసులు  వివిధ సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పతనంతిట్ట BJP అభ్యర్ధి, BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సురెంద్రన్ పై కూడా పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో ఆయన కూడా రెండు వారాల పాటు జైల్లో గడపవలసి వచ్చింది.