
886views
విజ్ఞాన భారతి , NCERT, విజ్ఞాన్ ప్రసార్ సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించబడిన “విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ” జాతీయ స్థాయి ప్రతిభా అన్వేషణ పరీక్ష రాష్ట్రస్థాయి శిబిరం విజయవాడలోని స్థానిక అరవింద హైస్కూల్ కుంచనపల్లిలో దిగ్విజయంగా ప్రాంభించడమైనది . ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ M. మాలకొండయ్య (Retd IPS), Prof.సుధీర్ శాండీల్యీ , Dr. . ఐ .సురేష్ (Advisor Vibha), Dr. J.చంద్రశేఖర్ రావ్ (కార్యదర్శి విజ్ఞాన భారతి), శ్రీమతి B. ఇంద్రాణి (అరవింద విద్యాసంస్థలు ) పాల్గొన్నారు .
జ్యోతి ప్రజ్వలన్ అనంతరం జరిగిన సభ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధి శ్రీ M. మాలకొండయ్య గారు ప్రసంగిస్తూ భారతదేశానికి ఉజ్వలమైన వైజ్ఞానిక వారసత్వం వున్నది అన్నారు. భారతీయ ప్రాచీన విజ్ఞాన శాస్త్రవేత్తలు అందించిన మౌలికమైన విషయాలు విజ్ఞాన శాస్త్ర ప్రపంచానికి పునాదులు వేశారు అన్నారు. అటువంటి ప్రాచీన విజ్ఞానముపై సరైన దిశలో పరిశోధనలు సాగాలని పిలుపునిచ్చారు .
Prof. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ దేశానికీ అవసరమయ్యే విజ్ఞానాన్ని వెలికి తీయుటకు దేశంలో మేధామథనం జరగాలని విద్యార్థులు ఒత్తిడిలేని పోటీ ద్వారా ఆవిష్కరణల దిశగా అడుగు వేయాలని ప్రోత్సాహించారు . Dr. బ్రజేష్ పాండే దేశవ్యాప్తంగా 1,40,000 విద్యార్థులు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్ష రాసారని ఈ పరీక్షలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు వివిధ రకాల అంశాలలో ( వ్రాత పరీక్ష , సైన్స్ వీడియో పరిశీలనాత్మక పరీక్షలు ) పరీక్షలు నిర్వహించి విజేతలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలో విజేతలు జాతీయ స్థాయిలో జరిగే శిబిరానికి అర్హత సాధించునట్లు పేర్కొన్నారు. NCERT , విజ్ఞాన భారతి , విజ్ఞాన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష వలన జాతీయస్థాయిలో విద్యార్థులలో సైన్స్ పట్ల అభిరుచి , ఉత్సుకత పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం Prof. సుధీర్ శాండీల్యి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పద్ధతులపై Power point Presentation ఇచ్చారు .
అనంతరం విద్యార్థులకు వ్రాత పరీక్ష , ప్రయోగ నైపుణ్య పరీక్ష , సైన్స్ వీడియో పరిశీలనాత్మక పరీక్షలు నిర్వహించడమైనది . ఈ పరీక్షలకు కోఆర్డినేటర్స్ శ్రీ PVLM శ్రీరామ్ , శ్రీ గోపి కృష్ణమూర్తి , శ్రీ కుమార్ బాబు , శ్రీ కామేశ్వరరావ్ , శ్రీమతి నివేదిత తదితరులు వ్యవహరించారు. .
విద్యార్థులు అత్యంత ఉత్సాహభరితంగా ప్రయోగ , ఇతర పోటీ పరీక్షలలో పాల్గొన్నారు . స్థానిక అరవింద హైస్కూల్ యాజమాన్యం , ఉపాధ్యాయులు చక్కటి సహకారం అందించారు.





