
మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైనారని కేంద్ర హోమ్ శాఖ విచారణలో వెలుగు చూసింది. దేశంలోని వివిద ప్రాంతాల్లో నివాసం ఉంటున్న రోహింగ్యా ముస్లీంలు ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైనారని, అక్కడి నుంచి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారని కేంద్ర హోమ్ శాఖ అధికారుల విచారణలో వెలుగు చూసింది.
దేశంలోని అన్ని ప్రాంతాల్లో వలస వచ్చి నివాసం ఉంటున్న రోహింగ్యాలకు వెంటనే కరోనా వైరస్ వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రోహింగ్యాలకు వైద్యపరీక్షలు చెయ్యడంలో ఆలస్యమైతే సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని కేంద్ర హోమ్ శాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించిందని తెలిసింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.