News

హిందూ పేరుతో నిజాముద్దీన్ మర్కజ్ కు

2.3kviews

బీర్ అలీ అనే వ్యక్తి హిందూ మతానికి చెందిన వ్యక్తి ఆధార్ వివరాలను ఉపయోగించి మార్చిలో ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన  మార్కజ్‌కు హాజరైనట్లు తమిళనాడు పోలీసులు కనుగొన్నారు.

త్రిచికి సమీపంలో ఉన్న ముష్రీ తాలూకాలోని వలవంతి గ్రామానికి చెందిన ఒక కిరణా షాపు యజమాని చెల్లాదురైని పోలీసులు బలవంతంగా కరోనా వైరస్ పరీక్షించడానికి తీసుకెళ్లడంతో ఈ కేసు హైలైట్ అయ్యింది. అతను ఎప్పుడూ గ్రామం నుండి బయటికి రాలేదని అతను నెత్తీ నోరూ బాదుకుంటూ ఉండగా పోలీసులు అతను మార్చిలో ఢిల్లీకి వెళ్ళినట్లుగా పేర్కొంటూ అతని ఆధార్ వివరాలు చూపించి అతనిని కోవిడ్ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఏప్రిల్ 11, శనివారం పోలీసులు, రెవెన్యూ మరియు ఆరోగ్య కార్యకర్తలు అతని తలుపు తట్టి, పరీక్ష కోసం వారితో పాటు రావాలని చెప్పగా చెల్లదురై షాక్ అయ్యారు. అదృష్టవశాత్తూ, అతని పరీక్ష నెగెటివ్ వచ్చింది. తన వద్ద పాస్‌పోర్ట్ లేదని, తన ఆధార్ నంబర్, అనుబంధ వివరాలను ఎవరో దుర్వినియోగం చేశారని చెల్లదురై మీడియాతో అన్నారు.

దాంతో పోలీసులు ఆ విషయమై ముమ్మర దర్యాప్తు కొనసాగించారు. అతని ఆధార్ నంబర్ మరియు చిరునామా ఉపయోగించి సబీర్ అలీ అనే వ్యక్తి చెన్నై నుండి ఢిల్లీ వెళ్ళడానికి ఎయిర్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు వారు కనుగొన్నారు. ఈ దుర్వినియోగం ఉద్దేశపూర్వకంగా జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీని వెనుక కుట్ర ఏమైనా ఉన్నదేమో తేల్చవలసిందిగానూ, వెంటనే దీనిపై లోతైన దర్యాప్తు జరుపవలసిందిగానూ ప్రజలు కోరుతున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు, తమిళనాడులో 1,242 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 1,117 తబ్లిఘి జమాత్ మార్కాజ్కు సంబంధించినవి. కాగా 14 మంది మృతి చెందారు.

Source : Organiser

https://www.organiser.org//Encyc/2020/4/18/Tablighi-Jamaati-from-TN-impersonates-Hindu-businessmen-by-misusing-his-Aadhar.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.