News

భారత్‌ కు ఐక్యరాజ్య సమితి ప్రశంస

654views

రోనా వైరస్‌పై పోరులో ఇతర దేశాలకు అండగా నిలుస్తున్న భారత్‌ను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఐరాస పిలుపునకు అనుగుణంగా ఇతర దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల్ని అందిస్తూ భారత్‌ ఆదర్శంగా నిలుస్తోందని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అభిప్రాయపడ్డారు. కొవిడ్-19 చికిత్సలో మంచి ఫలితాలిస్తుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల్ని ఇప్పటి వరకు భారత్‌ అనేక దేశాలకు పంపింది. వీటిలో అమెరికా, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక, మారిషస్‌ సహా పలు ఐరోపా, ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. రెండు లక్షల క్లోరోక్విన్‌ మాత్రల్ని అందుకున్న డొమినిక్‌ రిపబ్లిక్‌ సైతం ఈ సందర్భంగా భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు రష్యా సైతం భారత సంఘీభావం పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. తమకు క్లోరోక్విన్‌ మాత్రల్ని అందించాలన్న రష్యా అభ్యర్థనను భారత్‌ ఇటీవల అంగీకరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.