News

విజయవాడ ఉగ్రవాద మూలాల కేసులో కీలక పరిణామం.. బెయిల్‌పై నిందితుల విడుదల

2views

విజయవాడ ఉగ్రవాద మూలాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై ఇద్దరు నిందితులు విడుదలయ్యారు. ఈ కేసులో A5గా ఉన్న సయేదా బేగం రాజమహేంద్రవరంలోని ప్రత్యేక మహిళా కారాగారం నుంచి విడుదలైంది. రెండు రోజుల క్రితం కేంద్ర కారాగారం నుంచి ఏ4 షాద్‌మాన్ దిల్ఫష్ బెయిల్‌పై విడుదలయ్యాడు.

పాకిస్థాన్ ఉగ్రవాద మూలాలతో సంబంధాలు ఉన్నాయని ఈ ఏడాది మార్చిలో విజయవాడలో పదిమందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో వారిని మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ఎన్ఐఏ అధికారులు విచారించారు.

నిందితులకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆరునెలల వరకు నెలకు ఒకసారి హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయానికి వచ్చి కనిపించాలనే షరతుతో న్యాయస్థానం నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.