News

గిన్నిస్‌ రికార్డుకెక్కిన శంఖనాదం

7views

మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నది ఒడ్డున ఏకకాలంలో 517 మంది చేసిన శంఖనాదం గిన్నిస్‌ రికార్డు సాధించింది. ఈ నెల 31వ తేదీ నుంచి మొదలయ్యే సింహస్థ కుంభ మేళాను పురస్కరించుకుని నాసిక్‌ త్రయంబకేశ్వర్‌ కుంభ మేళా అథారిటీ, అనంత్‌విజయ్‌ శంఖనాద్‌ టీమ్‌ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల ప్రతినిధి రిశి నాథ్‌ సమక్షంలో 517 మంది ఐదున్నర నిమిషాలపాటు చేసిన శంఖనాదంతో గోదావరి పరిసరాలు ప్రతిధ్వనించాయి. ‘అభినందనలు, మీరు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు’అని రిశి నాథ్‌ ప్రకటించగానే, ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో చేరిన ప్రజలు భారత్‌ మాతా కీ జై అంటూ నినదించారు. కాగా, గతంలో అమెరికాలోని న్యూజెర్సీలో 2019లో 303 మందితో చేసిన శంఖనాదం ఇప్పటి వరకు ప్రపంచరికార్డుగా ఉంది.