
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెద పుత్తేడు గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ సహచరుడు, శిష్యుడు అయిన శ్రీ తుంగా పాండురంగారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ కు రెండు లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
పాండురంగారెడ్డి తల్లి గారి జ్ఞాపకార్థం వారు ఈ మొత్తాన్ని సింహపురి వైద్య సేవా సమితి/ జయభారత్ హాస్పిటల్ ట్రస్టీ శ్రీ గుఱ్ఱం సుధాకర్ మరియు హాస్పిటల్ మేనేజర్ శ్రీ గురు ప్రసాద్ లకు చెక్కు ద్వారా అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ గుఱ్ఱం సుధాకర్ మాట్లాడుతూ ఇలాంటి ఎందరో వదాన్యుల సహాయ సహకారాలతో జయభారత్ హాస్పిటల్ గత నాలుగు దశాబ్దాలుగా నిరుపేద రోగులకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించగలుగుతున్నదని తెలిపారు. ఎంతో విశాల హృదయంతో హాస్పిటల్ కి ఆర్థిక సాయాన్ని అందించిన శ్రీ తుంగా పాండురంగారెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.





