News

ఆకివీడు ఆలయ నిర్మాణం విచార జులై 13కు వాయిదా

44views

ఆకివీడు ఆలయ నిర్మాణంపై సుప్రీంకోర్టులో కమిటీ తరఫు న్యాయవాది సుయోధన్ వాదనలు వినిపించారు. గత వారం విచారణ సందర్భంగా యధాతథ స్థితి కొనసాగించాలని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ఆదేశించింది. దీంతోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. నోటీసులకు ఆలయ కమిటీ కౌంటర్ దాఖలు చేసింది. వేసవి సెలవుల్లో కేసు పూర్తి విచారణ జరపాలని సుయోధన్ కోరారు. సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభమయ్యాక విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. ఆ లోపు రాష్ట్ర ప్రభుత్వం సహా ప్రతివాదులంతా కౌంటర్లు దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను జులై 13కి వాయిదా వేసింది.