News

అభినయ్ దర్శన్ వ్యవహారంపై హోం మంత్రి అనిత స్పందన

28views

క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై హోం మంత్రి అనిత స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని.. ఈ వ్యవహారంలో రాజకీయ కోణంపైనా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కుట్రకోణం లేకపోతే కడప నుంచి అల్లూరి జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అమాయకపు గిరిజనులను అభినయ్ దర్శన్ నమ్మించి పాస్టర్ అవతారం ఎత్తారని.. ఆయనపై దాడి జరగకపోయినా జరిగిందని నమ్మించారన్నారు. అభినయ్ దర్శన్ వ్యవహారంలో ఎవరు ఉన్నారనేది త్వరలో బయటపడుతుందని తెలిపారు.

దర్శన్‌పై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేశారని హోంమంత్రి వెల్లడించారు. ప్రభుత్వాన్ని బదనాం చేసే దృక్పథం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోందని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఇటువంటి నాటకాలు చెల్లవని.. ఇలాంటి ఆలోచనలు ఇంకెవరికైనా ఉంటే మానుకోవాలని హితవుపలికారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అభినయ్ దర్శన్‌ను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తామని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.