News

మతమార్పిడి యత్నం కేసు… ఇద్దరు ముస్లిం యువతులపై ఎఫ్ఎఆర్ కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ

68views

సహ విద్యార్థినితో బురఖా ధరింపజేసేందుకు, ఆమె ఇస్లాం మతం స్వీకరించేందుకు ఒత్తిడి చేశారంటూ ఆరోపణ ఎదుర్కొంటున్న ఇద్దరు 12వ తరగతి విద్యార్థినులపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. నిందితురాళ్లైన యువతులపై ఉత్తర్ ప్రదేశ్ మతమార్పిడుల నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. యువత తమ విశ్వాసాలను ఇతరులపై రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని జస్టిస్ జె.జె. మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాల ధర్మాసనం పేర్కొంది. మురాదాబాద్ కు చెందిన బాధితురాలి సోదరుడు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎస్ఐఆర్ నమోదు చేశారు.