
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రం ఎప్పుడూ భక్తులతో రద్దీగానే ఉంటుంది.. అయితే, తిరుమల ప్లాన్ చేసుకునే భక్తులకు కీలక సమాచారం వచ్చింది.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల సమయాల్లో మార్పులు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి రోజూ ఉదయం 5 గంటలకే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో మధ్యాహ్నం సమయంలో టోకెన్లు ఇచ్చే విధానం అమల్లో ఉండేది. అయితే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమయాల్లో మార్పులు చేసినట్లు సమాచారం.
సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని Srinivasam Complex, Vishnu Nivasam, Alipiri Bhudevi Complex కేంద్రాల్లో జారీ చేస్తున్నారు. భక్తులు ముందస్తుగా చేరుకుని టోకెన్లు పొందాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా సెలవు రోజులు, వారాంతాలు, పండుగల సమయంలో భారీగా భక్తులు తరలివస్తుండటంతో టోకెన్ల కోసం ముందుగానే క్యూ లైన్లు ఏర్పడుతున్నాయి. దీంతో దర్శనానికి వచ్చే భక్తులు కొత్త సమయాలను గమనించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని టీటీడీ సూచించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అధికారిక ప్రకటనలు, తాజా సమాచారం తెలుసుకుని ప్రయాణం చేయడం మంచిదని అధికారులు తెలిపారు. కావున, తిరుమల వెళ్లే భక్తులు ఇది దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది..





