News

హైదరాబాద్‌లో మరో లవ్ జిహాద్

82views
హైదరాబాద్ సిటీలో మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో ఇది జరిగింది. నవాజ్ అనే ముస్లిం వ్యక్తి కూకట్ పల్లి పరిధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని, అక్కడే వున్న యువతిని వలలో వేసుకోవడానికి ప్లాన్ వేశాడు. తాను ముస్లిమని చెబితే నమ్మదని తెలిసి, హిందువు లాగా నటించాడు. ఆ యువతికి వంద శాతం నమ్మకం కలిగేలా ప్రవర్తించి, ప్రేమతో లోబర్చుకున్నాడు. దీని తర్వాత గత యేడాది జూన్ మాసంలో వివాహం కూడా జరిగింది.
పెళ్లైన మొదటి రోజు నుంచే నరకం చూపటం ప్రారంభించాడు. పెళ్లి రోజు రాత్రి నవాజ్ తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. పార్టీ పేరుతో తన స్నేహితులను, సోదరులను ఇంటికి ఆహ్వానించాడు. బాధితురాలికి మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై నవాజ్ స్నేహితులు, సోదరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భర్తే స్వయంగా ఈ ఘాతుకానికి ప్లాన్ చేశాడని తెలిసి ఆ యువతి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
ఆ యువతిని మానసికంగా, శారీరకంగా హింసించడమే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతీశాడు. ఆమెకు చెందిన విలువైన ప్లాట్‌ను, బంగారాన్ని బలవంతంగా లాక్కున్నాడు. అంతటితో ఆగక, ఆమె పేరు మీద బ్యాంకుల్లో భారీ మొత్తంలో లోన్లు కూడా తీయించాడు. వీటన్నింటి తర్వాత యువతికి అసలు విషయం తెలిసింది. ఇప్పటికే నవాజ్ కి రెండు పెళ్లిళ్లు అయ్యాయని, తాను మోసపోయాయని తెలిసింది.
దీంతో యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు నవాజ్, అతని స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరో వైపు హిందూ సంఘాలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడ్ని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ప్రేమ పేరుతో కొందరు ముస్లింలు లవ్ జిహాద్ చేస్తున్నారని, దాని వలలో హిందూ యువతులు, మహిళలు చిక్కుకోవద్దని హిందూ సంఘాలు పదే పదే చెబుతూనే వున్నాయి. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఇలాంటి మోసాలను, లవ్ జిహాద్ కేసులను నిత్యం బయటపెడుతూనే వున్నాయి. ప్రేమ పేరుతో, మరో పేరుతో హిందూ మహిళలను లోబర్చుకుంటున్నారని, ఏ రకంగానూ వారి వలలో చిక్కుకోవద్దని పదే పదే కోరుతున్నాయి. అయినా సరే అమాయకమైన హిందూ అమ్మాయిలు వారి వలలో చిక్కుకుంటున్నారు.