
45views
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్‌శాల – కమల్ మౌలా మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేపట్టిన శాస్త్రీయ సర్వేకు వ్యతిరేకంగా ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తాము ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ, ముస్లిం పక్షం లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ మధ్యప్రదేశ్ హైకోర్టులోనే తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు భోజ్‌శాల ప్రాంగణంలో ఏఎస్ఐ బృందం సుదీర్ఘంగా సర్వే నిర్వహించి, ఒక సమగ్ర నివేదికను సమర్పించింది. అయితే, ఈ సర్వే నివేదికతో పాటు అక్కడ రికార్డు చేసిన వీడియోగ్రఫీ మరియు కలర్ ఛాయాచిత్రాలపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని మౌలానా కమలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ (ముస్లిం పక్షం) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వే సమయంలో తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని, ఆ వలయాల్లో పూర్తి స్థాయిలో ఆధారాలు పరిశీలించడానికి తమకు తగిన సమయం ఇవ్వాలని వారు కోరారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది: ఏఎస్ఐ సర్వేకు సంబంధించిన వీడియోగ్రఫీని హైకోర్టులో ప్రదర్శించే అవకాశం ఉంది. కాబట్టి అన్ని పక్షాలు తమ వాదనలు అక్కడ వినిపించవచ్చు అని పేర్కొంటూ, సహజ న్యాయ సూత్రాలకు కట్టుబడి, ముస్లిం పక్షం లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను మధ్యప్రదేశ్ హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించింది. హైకోర్టులో కొనసాగుతున్న విచారణ ప్రక్రియలో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.
అసలేంటీ వివాదం అంటే
11వ శతాబ్దానికి చెందిన ఈ భోజ్‌శాల కట్టడాన్ని హిందువులు వాగ్దేవి (సరస్వతీ దేవి) ప్రాచీన ఆలయం. మరోవైపు ముస్లిం పక్షం దీనిని కమల్ మౌలా మసీదుగా పేర్కొంటూ దశాబ్దాలుగా వివాదం కొనసాగిస్తోంది. ఏఎస్ఐ నివేదిక ప్రకారం ప్రస్తుతమున్న కట్టడం గతంలో ఉన్న ఆలయ శిథిలాలపై నిర్మితమైంది. మధ్యప్రదేశ్ హైకోర్టుకే అప్పగించింది.





