
భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయని ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.కనుక, భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని తదనుగుణంగా మార్చుకుని కనీసం గంట ముందుగా ప్రారంభించాలని టిటిడి కోరుతోంది.
మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించగలరని ఈ నేపథ్యంలో తిరుమల నుండి రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్డీసీ బస్ స్టాండ్లు వెళ్ళే భక్తులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని టిటిడి సూచిస్తోంది.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు, భక్తులు తమ తిరుమల ప్రయాణన్ని రూపొందించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులు, వాహదారులు సహకరించాలని టిటిడి కోరుతోంది.





