News

108 అడుగుల నీలకంఠ వర్ణి విగ్రహ ప్రతిష్ఠ

93views

సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా BAPS స్వామినారాయణ సంస్థ మరో అద్భుత ఘట్టం ఆవిష్కరించింది. భగవాన్ స్వామినారాయణ బాల్య రూపమైన నీలకంఠ వర్ణి 108 అడుగుల భారీ విగ్రహానికి ప్రస్తుత గురువులు పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్ శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ఠచేశారు.

108 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ విగ్రహం భగవాన్ స్వామినారాయణ విగ్రహాల్లోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా నిలిచింది. స్వామినారాయణ తన 11 ఏళ్ల ప్రాయంలో భారతదేశం అంతటా కాలినడకన చేసిన తపస్సు యాత్రను స్మరిస్తూ, ‘నీలకంఠ వర్ణి’ తపస్సు ముద్రలో ఉన్న రూపం ఇది.

వేద మంత్రోచ్ఛారణలు, విశేష పూజల మధ్య మహంత్ స్వామి మహారాజ్ ఈ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ వేడుకకు వేలాది మంది హరిభక్తులు, సాధువులు హాజరు కానున్నారు. త్యాగం, తపస్సు మరియు భక్తికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. యువతలో ఆధ్యాత్మికతను, ధార్మిక చింతనను పెంపొందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.