News

సీతారాముల కల్యాణంపై నవీముంబయిలో చాగంటి ప్రవచనం

111views

నవీముంబయిలో అక్కడి తెలుగు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రవచనానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఐరోలి ప్రాంతంలోని ఓ ఫంక్షన్‌ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు.. సీతారాముల వివాహ వృత్తాంతాన్ని భక్తిరసస్ఫోరకంగా వివరించారు. విశ్వామిత్ర మహర్షి వెంట రామలక్ష్మణులు మిథిలా నగరానికి చేరుకుని జనక మహారాజును కలుసుకోవడం, సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచే ఘట్టం.. తుదకు సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా సాగిన తీరు వరకు ఆద్యంతం ఆకట్టుకునేలా చాగంటి ప్రవచనం సాగింది.