News

కీలక మలుపు తిరిగిన మోనాలిసా వివాహ వ్యవహారం

127views

మోనాలిసా వివాహ వ్యవహారం మరింత ముదురుతోంది. తన కుమార్తెకి కేవలం 17 సంవత్సరాలు మాత్రమేనని తల్లి ప్రకటించడంతో ఇది కీలక మలుపు తిరిగింది. మోనాలిసా తల్లే వయస్సును ధ్రువీకరిస్తోందని, పేర్కొంటూ విశ్వహిందూ పరిషత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ వివాహం కుదిర్చిన వారిపై, పెళ్లికి హాజరైన వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

కేరళ విద్యామంత్రి శివన్ కుట్టి, రాజ్యసభ ఎంపీ రహీమ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్, భర్త ఫర్మాన్ ఖాన్, ఆలయ అధికారులపై వెంటనే కేసులు పెట్టాలని, వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేసింది.

బాల్య వివాహ నిషేధ చట్టం,పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని వీహెచ్ పీ డిమాండ్ చేసింది. మోనాలిసాది పెళ్లి చేసుకునే వయస్సే కాదని, ఈ సమాచారం స్పష్టంగా వారందరికీ తెలిసినా, వివాహం జరిపించారని, ఆ వ్యక్తులందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

మోనాలిసాకు ఇంకా 18 సంవత్సరాలు నిండనేలేదని VHP పేర్కొంది. విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ క్షేత్రీయ సంయోజక్ జిజేష్ పట్టేరి మోనాలిసా తల్లితో ఫోన్ సంభాషణ తర్వాత అసలు విషయం బయటపడిందని కూడా పేర్కొంది.మోనాలిసా వయస్సు గురించి తన తల్లే అసలు విషయం చెప్పేయడంతో తీవ్ర ఆందోళన రేగుతోంది. ‘‘నా కుమార్తె వయస్సు కేవలం 16 సంవత్సరాలే. పెళ్లికి నేను అనుమతి ఇవ్వలేదు’’ అని తల్లి స్పష్టం చేసింది.కుంభమేళా ఛాయాచిత్రాలు వైరల్ అయిన తర్వాత మోనాలిసా విస్తృతంగా ప్రసిద్ధి చెందిన తర్వాత కుటుంబం ఆమెతో సంబంధాలు తెగిపోయాయని ఆమె అన్నారు.

మోనాలిసా తండ్రి ప్రస్తుతం కేరళలో వున్నాడని, ఫర్మాన్ ఖాన్ మోనాలిసాను బలవంతంగా పెళ్లి చేసుకొని, తమ నుంచి దూరం చేశారని మోనాలిసా తల్లి చెప్పుకొచ్చారు. పుట్టిన రోజుకి సంబంధించిన అధికారిక పత్రాలు మోనాలిస వద్దే వున్నాయని కూడా పేర్కొంది.”సర్టిఫికెట్లన్నీ నా కూతురి చేతుల్లోనే ఉన్నాయి, నాకు పుట్టిన తేదీ ఖచ్చితంగా తెలియదు” అని ఆమె అన్నారు. సహాయం కోసం విజ్ఞప్తి చేస్తూ, ఆ తల్లి, “దయచేసి నా కూతురిని తిరిగి తీసుకురావడానికి మాకు సహాయం చేయండి. నా కూతురికి ఏదైనా జరిగితే, నేను ఆత్మహత్య చేసుకుంటాను” అని ప్రకటించింది.

సీపీఎం నేతల సమక్షంలోనే వివాహం జరగడంతో వివాదం మరింత ముదిరింది. తిరువనంతపురం జిల్లాలోని ఒక మందిరంలో జరిగిన ఈ వేడుకకు కేరళ విద్యా మంత్రి వి. శివన్‌కుట్టి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్, రాజ్యసభ ఎంపీ ఎ.ఎ. రహీమ్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

దేవాలయంలో మోనాలిసా వివాహం ఎందుకో? హిందూ ఐక్యవేదిక
మోనాలిసా వివాహం హిందూ దేవాలయంలో ఎందుకు జరిగిందని హిందూ ఐక్యవేదిక సూటిగా ప్రశ్నించింది. మసీదులో కాకుండా, ఇస్లామిక్ ఆచారాల ప్రకారం కాకుండా హిందూ ప్రకారం ఎందుకు జరిగిందో చెప్పాలని ఆర్.వి. బాబు ప్రశ్నించారు. మోనాలిసా హిందువు కాబట్టి మందిరంలో వివాహం జరిగిందని ఆయన అన్నారు.ఇస్లామిక్ మత చట్టం ముస్లిం పురుషుడు మతం మారకుండా ‘కాఫిర్’గా కొనసాగుతున్న ముస్లిమేతర స్త్రీని వివాహం చేసుకోవడానికి అనుమతించదని, మోనాలిసా ఇస్లాం మతంలోకి మారితేనే ఆ వివాహాన్ని ఇస్లాంలో మతపరంగా గుర్తించవచ్చని మరియు అలా కాకపోతే ఇస్లామిక్ మత నాయకులు ఈ విషయాన్ని బహిరంగంగా స్పష్టం చేయాలని ఆయన నొక్కి చెప్పారు.