News

హనుమాన్ చాలీసా ప్లే చేసినందుకు ముస్లిం ఛాందసుల దాష్టీకం

104views

ఆ హిందూ కుటుంబం తప్పేమీ చేయలేదు. ఎవ్వరి జోలికీ పోలేదు. వారు చేసిందల్లా హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లలో పెట్టారు. ఇంతే చేసింది. ఇలా చేస్తారా? అంటూ ఏకంగా ముగ్గురు ముస్లింలు ఆ హిందువుల ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశారు. హనుమాన్ చాలీసా లౌడ్ స్పీకర్లలో ఎలా పెడతారంటూ పిడిగుద్దులు గుద్దారు. ఈ ఘటన గజియాబాద్ లోని నందగ్రామ్ ప్రాంతంలో జరిగింది.

మరోవైపు బాధితులు మాత్రం తామేమి తప్పు చేశామని దాడులకు దిగారో చెప్పాలంటూ ముస్లిం ఛాందసులు ప్రశ్నిస్తున్నారు. తాము హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లలో పెడితేనే ముస్లింలు దాడులకు దిగారని, దీనితోనే ఘర్షణ ప్రారంభమైందని పూజ అనే హిందూ మహిళ స్పష్టంగా పేర్కొంది. ఈ క్రమంలోనే భౌతిక దాడి కూడా జరిగిందని పేర్కొంది.

‘‘వాళ్లు నా కూతురుని సుత్తితో కొట్టారు. హోళీ పండగ సందర్భంగా మా అమ్మ దగ్గరికి వచ్చాను. మా నాన్న ఆరోగ్యం కూడా బాగోలేదు. చూసిపోదామని వచ్చాను’’ అంటూ పూజ పేర్కొ్ంది. అలాగే ‘‘దగ్గర్లో వున్న కిరాణా షాపులో కొనడానికి మా ఆమర బయటికి వచ్చాడు. అంతే నిందితులు అతడ్ని లక్ష్యం చేసుకున్నారు. మా ఇంట్లోకి ప్రవేశించి, కుటుంబీకులపై దాడి చేశారు. తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు’’ అని వివరించింది.
మరో వైపు పోలీసులు కూడా స్పందించారు. లౌడ్ స్పీకర్లలోనే హనుమాన్ చాలీసా వేయడంతోనే వివాదం జరిగిందని పేర్కొంటున్నారు. ఇంట్లోకి బలవంతంగా చొరబడినందుకు నిందితులపై కేసులు నమోదుచేశామని, ముగ్గురు నిందితులు తమ అదుపులోనే వున్నారని ప్రకటించారు.

మరి.. కొన్ని మతాల వారు వారి ప్రార్థనా సమయాల్లో బిగ్గరగా లౌడ్ స్పీకర్లు పెట్టి అందరికీ వినిపిస్తుంటారు. మరి ఆ విషయం ఏం కావాలి? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అంత పెద్ద సౌండ్ వున్నా.. తామేనాడూ హింసాత్మక ఘటనలకు దిగలేదని, కానీ ముస్లిం ఛాందసులు మాత్రం తమపై దాడికి దిగారని మండిపడుతున్నారు.