
ఈ దేశంలో వుంటూ, భారత ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు నెరుపుతున్న వారిపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా… జమ్మూ కశ్మీర్ ప్రభుత్వంలోని జల్ శక్తి శాఖపై ప్రభుత్వం దృష్టి సారించింది. దేశ వ్యతిరేక, విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. తక్షణమే ఇది అమలులోకి వస్తుందని కూడా ప్రకటించింది.
కిష్త్వార్ జిల్లాలోని బెర్వాడ్ లోని లియాఖత్ అలీ, కిష్త్వార్‌లోని PHE సబ్-డివిజన్ పరిధిలోని హుల్లర్‌లో నీడ్-బేస్డ్ క్యాజువల్ కార్మికుడు కౌసర్ హుస్సేన్ తో పాటు బిజ్ బెహారాలోని షౌకత్ అహ్మద్ జర్గర్ ఈ జాబితాలో వున్నాడు. వీరు ముగ్గురూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ హోంశాఖ జలశక్తి విభాగానికి సమాచారం అందించింది. దీంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.





