
విద్యార్థుల్లోని సృజనాత్మకత, మేథస్సును వెలికితీసి ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అవకాశం కల్పిస్తోంది. ‘యువ విజ్ఞాని కార్యక్రమ్’(యువిక-2026) పేరుతో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనుంది. ఇందుకుగాను దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 2026 జనవరి 1 నాటికి తొమ్మిదో తరగతి చదువుతున్న భారతీయ విద్యార్థులు మాత్రమే అర్హులు.
ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు
jigyasa.iirs.gov.in/yuvika పోర్టల్., www.isro.gov.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది.
ముందుగా జిగ్యాస వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్థి పేరు, ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి.
వెయిటేజీ కల్పిస్తారు
రిజిస్ట్రేషన్లు ప్రారంభం: ఫిబ్రవరి 27
నమోదుకు చివరి తేదీ: మార్చి 31
రెండో జాబితా (ఖాళీల ఆధారంగా): ఏప్రిల్ 20
మొదటి ఎంపిక జాబితా విడుదల: ఏప్రిల్ 13
శిక్షణ (యువిక): మే 11 నుంచి 22 వరకు





