News

NIT వరంగల్ లో ‘హనుమాన్ చాలీసా’ గెలుపు!

115views
“ధర్మో రక్షతి రక్షితః” అన్న మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు వరంగల్ NIT విద్యార్థులు. తమ అస్తిత్వం కోసం, తమ విశ్వాసం కోసం వారు చేసిన పోరాటం కేవలం ఒక విజయం మాత్రమే కాదు.. అది భక్తికి, పట్టుదలకు దక్కిన నీరాజనం.
అసలేం జరిగింది?
గత ఏడాదిన్నరగా ప్రతి మంగళవారం పది నిమిషాల పాటు ప్రశాంతంగా సాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఫిబ్రవరి 17న కొందరు అధికారులు అడ్డుకోవడం సంచలనం సృష్టించింది.
విద్యార్థుల నుంచి మొబైల్ ఫోన్లు లాక్కోవడం, వార్డెన్, డీన్ స్థాయి వ్యక్తులు వారిని భయభ్రాంతులకు గురిచేయడం, చాలీసా పారాయణం ను బలవంతంగా నిలిపివేయడం వంటి చర్యలు హిందూ విద్యార్థుల మనోభావాలను దెబ్బతీశాయి.
తిరగబడ్డ హిందూ విద్యార్థులు – లొంగిన అధికారులు
తమ హక్కులను కాలరాస్తుంటే విద్యార్థులు మౌనంగా కూర్చోలేదు. భయం నీడలో బ్రతకడం కంటే, ధర్మం కోసం నిలబడటమే మిన్న అని భావించారు. హిందూ విద్యార్థులంతా ఏకతాటిపైకి వచ్చి తమ గళాన్ని వినిపించారు. “హనుమాన్ చాలీసా పారాయణం మా హక్కు” అని నినదించారు.
చివరికి విద్యార్థుల సంకల్పం ముందు అడ్డంకులు కరిగిపోయాయి. ఫిబ్రవరి 24న జరిగిన పారాయణంలో సాక్షాత్తూ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ స్వయంగా పాల్గొని, విద్యార్థుల క్రమశిక్షణను, వారి భక్తిని అభినందించడం విశేషం.
సంఘే శక్తి కలౌ యుగే
“ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఉంటుందో.. అక్కడ విజయం తప్పక వరిస్తుంది. బెదిరింపులకు లొంగకుండా, తమ సంస్కృతిని కాపాడుకున్న NIT వరంగల్ హిందూ విద్యార్థులు నేటి యువతకు ఆదర్శప్రాయులు.”