
సామాజిక సమరసత వేదిక విజయవాడ శాఖ వారి ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమకర్త శ్రీ సంతు గాడ్గే బాబా విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడ గులాబీ తోట పార్క్ నందు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వామి శితి కంఠనంద, అఖిలభారత సామాజిక సమరసత వేదిక కన్వీనర్ శ్యాంప్రసాద్ జి, నిర్వాహకులు కొండపల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, బాబా గారు సామాజిక స్పృహాతో వారి జీవితాంతం పరిశుభ్రత కొరకు పనిచేసి అనేక మందికి ఆదర్శవంతంగా నిలిచారని భారత దేశంలో ప్రతి ఒక్కరు బాబా వారిని ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు.
ఈ సందర్భంగా కొండపల్లి చిన్ని మాట్లాడుతూ, మహనీయుని విగ్రహం రాష్ట్రంలో తొలి సారిగా విజయవాడలో ప్రతిష్టాత్మకoగా ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని అన్నారు.
సమరసత ఆల్ ఇండియా కన్వీనర్ శ్యాం ప్రసాద్ జి మాట్లాడుతూ వివక్షకు గురైన వర్గాలవారు దేవాలయాల ప్రవేశాలకు నోచుకోని సమయంలో వారికి దేవాలయాల ప్రవేశం కల్పించడానికి అనేక ప్రయత్నాలు చేసి బాబా వారు సఫలీకృతం అయ్యారని అలాగే జాతిపిత గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ సమకాలికుడిగా అనేక విద్యాలయాలు మహారాష్ట్రలో బాబా వారు నిర్మించారని తెలియజేశారు.
విశ్వహిందూ పరిషత్ అఖిలభారత సంఘటనా మంత్రి మాట్లాడుతూ సామాజిక సంస్కర్త అయిన బాబా వారుకి తగిన గుర్తింపు లభించలేదని ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి 1999 సంవత్సరంలో వారి సేవలను గుర్తించి తపాలా స్టాంపులు విడుదల చేశారని అదే స్ఫూర్తితో భారత దేశ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గ్రామస్థాయి పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు సంతు గాడ్గే బాబా గ్రామ స్వచ్ఛత అభియాన్ పథకాన్ని అమలుపరుస్తుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం, నిర్వాహకులు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులుకొండపల్లి తిరుపతిరావు ( చిన్ని )అమరావతి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు బండారు కొండ, వాకర్స్ జిల్లా పి ఆర్ ఓ కొండాయ గుంట రాము,వల్లూరి మధుసూదన్ రావు, వెంకటేశ్వరరావు, శేషగిరిరావు, కొండపల్లి అవినాష్ అభిషేక్ ,బత్తిన హరి, చిక్కవరపు మహానంద కుమార్, దాచేపల్లి ప్రదీప్, అవుటపల్లి ఒకటే శివప్రసాద్ , జిల్లెళ్ళ శ్రీరాములు,వీరస్వామి, ఆవుల మంద వీరబాబు, శ్రీనివాస్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.





