
కేంద్ర ప్రభుత్వం ‘జ్ఞాన భారతం మిషన్’ పేరుతో చారిత్రక సంపదను పరిరక్షించే ఓ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందాన్ని, చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే అత్యంత విలువైన, అరుదైన కోటి రాతప్రతుల సంపదను భావితరాలకు అందించే ఈ మిషన్ లో తాము బాగస్వామ్యులవడం ఆనందంగా ఉందని బాపట్ల జిల్లా, చీరాలకు చెందిన సనాతన జీవన్ ట్రస్ట్ ఉందని ట్రస్ట్ వ్యవస్థాపకులు, నాడీ వైద్యులు శశిధర్ తెలిపారు.
భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పురాతన రాత ప్రతులను సంరక్షించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం 20 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోగా వాటిలో జిల్లాలోని చీరాలకు చెందిన సనాతన జీవన్ ట్రస్ట్ ఉందని ట్రస్ట్ వ్యవస్థాపకులు,నాడీ వైద్యులు శశిధర్ తెలిపారు. కొత్తపేటలోని ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాడీ వైద్యులు శశిధర్ మాట్లాడారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ పురాతన రాతప్రతులను సంరక్షణ కోసం “జ్ఞాన భారతం” అనే మిషన్ ప్రారంభించారని,ఈ అద్భుతమైన కార్యక్రమనికి ప్రజలందరూ భాగస్వాములై సహకరించాలని అయన కోరారు.ప్రజల వద్ద గాని లేక గ్రంథాలయాల్లో ఉన్నా తాళపత్ర గ్రంధాలను శుభ్రపరిచి డిజిటల్ రూపంలో “జ్ఞాన భారతం మిషన్” లో భద్రపరిచి భావితరాలకు అందించేందుకు ముందుకు రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. శుభ్రపరిచిన వాటిని తిరిగి తీసుకునే అవకాశం ఉందన్నారు.
పురాతన తాళపత్ర గ్రంధాలను కాపాడేందుకు ట్రస్ట్ తరుపున ఐదేళ్ల క్రితమై శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు.ఈక్రమంలోనే తాళపత్రాలను స్కాన్ చేయడానికి జర్మనీ నుంచి అత్యాధునిక స్కానర్ ను తీసుకొచ్చి, తొలుత వేటపాలెంలోని సరస్వతీ గ్రంధాలయం, ఆతర్వాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంతో కలిసి మ్యాన్యు స్క్రిప్టు శుభ్రపరిచి డిజిటలైజేషన్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఎనిమిది లక్షలకు పైగా తాళపత్ర గ్రంధాలు, రెండు లక్షలకు పైగా కాగితపు ప్రతుల పేజీలను పరిరక్షించినట్లు చెప్పారు. వీటిని NMM (నేషనల్ మిషన్ ఆఫ్ మన్యు స్క్రిప్ట్) డైరెక్టర్ ఆచార్యులు అనిర్బన్ దాస్, భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన డివై చంద్ర చూడ్ సైతం ఈప్రక్రియను స్వయంగా పరిశీలించారని తెలిపారు.కాగా త్వరలో ఈప్రక్రియ ఫై ప్రజలకు ,ఔత్సహికులకు అవగాహన కల్పించే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ట్రస్ట్ కార్యాలయం వద్ద అవగాహనా సదస్సు సైతం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు..





