ArticlesNews

దేశవ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తున్న ‘‘ప్రబోధనం’’…

12views

మలయాళ వార పత్రిక ‘‘ప్రబోధనం’’ దేశ వ్యతిరేక విషయాలను ప్రచురిస్తూ, ప్రచారం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పత్రిక ద్వారా దేశ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తోందన్న విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణకు కూడా సిద్ధమవుతోంది.

జమాత్-ఎ-ఇస్లామీ హింద్ యొక్క అధికార పత్రికగా దీనికి పేరుంది. హిందువులను నిత్యం వేధిస్తోన్న, హింసిస్తున్న బంగ్లాదేశ్ కు అనుకూలంగా, భారత్ కి వ్యతిరేకంగా వార్తలు, ఇంటర్వ్యూలను ఈ పత్రిక అచ్చువేస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ఈ పత్రిక పై నిషేధం కూడా పడింది.

తాజాగా ప్రబోధనం సంచికలో బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ అధ్యక్షుడు డాక్టర్ షఫీకుర్ రెహమాన్ మరియు మరో సీనియర్ నాయకుడు నజీబుర్ రెహమాన్‌తో సహా, భారతదేశ వ్యతిరేక వైఖరులు మరియు విధాన దృక్పథాలను వెలిబుచ్చే బంగ్లాదేశ్ నేతల ఇంటర్వ్యూలు, వార్తలను ప్రచురించింది.

జనవరి 30 వ తేదీకి సంబంధించిన ప్రబోధనం ఎడిషన్ లో డాక్టర్ షఫీకర్ రెహ్మాన్ తో ఇంటర్వ్యూను అచ్చు వేసింది. దీనిని వాస్తవానికి ప్రముఖ మిడిల్ ఈస్ట్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఖతార్ నుండి అల్ జజీరా ప్రచురించింది. అలాగే మాజీ ప్రధాని షేక్ హసీనాను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేసిన షఫీకుర్ రెహమాన్ ఇంటర్వ్యూను సెప్టెంబర్ 6, 2024 న ప్రచురించింది.

అలాగే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అల్లర్లు, హింసను సమర్థిస్తూ టర్కిష్ ఇస్లామిక్ మీడియా నెట్ వర్క్ అయిన టిఆర్‌టి వరల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను మలయాళంలో కూడా అనువాదం చేసి, అచ్చువేసింది. కొంతకాలం క్రితం ఉరి తీయబడిన బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ మాజీ అధ్యక్షుడు మోతియుర్ రెహ్మాన్ నిజామీ కుమారుడు నజీబుర్ రెహ్మాన్ నిజామీ అల్ జజీరా ఛానల్ ఇంటర్వ్యూను కూడా ప్రబోధనం ప్రసారం చేసింది.

అయితే.. ప్రబోధనం పత్రికలో బంగ్లా భాష నుంచి మరీ మలయాళంలోకి మార్చి ఇంటర్వ్యూలు వేయడంపై కూడా అనుమానాలున్నాయి. దీని వెనుక ఓ నిర్దిష్టమైన అజెండాలు వున్నాయని తెలుస్తోంది. భారత వ్యతిరేక సిద్ధాంతాలను, విధానాలను అవలంబించే ఇంటర్వ్యూలు ఎలా అచ్చు వేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

జమ్మూ కశ్మీర్ టైమ్స్ పత్రిక కూడా అంతే…

గత యేడాది నవంబర్ మాసంలో జమ్మూ కశ్మీర్ టైమ్స్ పత్రికా కార్యాలయంపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. సందర్భంగా ఆ పత్రికా కార్యాలయంలో బుల్లెట్స్ లభ్యమవ్వడతో కలకలం రేగింది. రాష్ట్ర దర్యాప్తు బృందం జరిపిన సోదాల్లో ఏకే 47 రైఫిల్స్, రైఫిల్ కాట్రిడ్జ్, మరిన్ని పిస్తోలు తూటాలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. పిస్టల్ రౌండ్స్, మూడు గ్రనేడ్ పిన్నులు స్వాధీనం చేసుకున్నారు.

మరో వైపు కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనూరాధ భాసిన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారత దేశం, జమ్మూకశ్మీర్ కి వ్యతిరేకంగా, వేర్పాటువాదానికి అనుకూలంగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా వేర్పాటువాదులు, దేశ వ్యతిరేకులతో కలిసి నేరపూరిత్ర కుట్ర నెరుపుతున్నట్లు కూడా పోలీసులు పేర్కొంటున్నారు.

గతంలోనూ దేశ భద్రత విషయంలో గానీ, దేశానికి వ్యతిరేకంగా కానీ.. జేకే టైమ్స్ లో ప్రచురితమైనవి ఇవీ…

1. ఆర్టికల్ 370 ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత, జమ్మూ కశ్మీర్ లో మీడియాపై విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ అనూరాధ భాసిన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా డిసెంబర్ 2023లో, అనురాధ భాసిన్ ఆర్టికల్ 370, దాని చరిత్ర, చట్టపరమైన సందర్భాలు మరియు ప్రాముఖ్యతపై ఒక వ్యాసం రాశారు. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దుకి వ్యతిరేకంగా అందులో రాశారు.సుప్రీంకోర్టు కూడా సమర్థించిన ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35a రద్దును రాజకీయ మోసమని, రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని చెప్పుకొచ్చారు.

2. ముందు నుంచి కూడా కశ్మీర్ టైమ్స్ భారత వ్యతిరేక ప్రయోజనాలు వెలిబుచ్చే వారికి, జాతీయ భావాలకు వ్యతిరేకంగా వున్న వారికి వేదికను ఇచ్చేది. డిసెంబర్ 20203 లో 2020 హిందూ వ్యతిరేక ఢిల్లీ అల్లర్లతో సంబంధమున్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రాసిన కథనాన్ని ప్రచురించింది.

3. 2023 డిసెంబరులో ఆర్టికల్ 370 చరిత్ర, చట్టపరమైన ప్రాముఖ్యతపై అనురాధా భాసిన్ ఒక వ్యాసం రాశారు. తన వ్యాసంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేయకుండా ఉండాల్సిందని, అది కేవలం తాత్కాలిక వెసులుబాటు కాదని ఆమె వాదించారు. సుప్రీంకోర్టు కూడా ఆమోదించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 37ఏ రద్దును రాజకీయ, రాజ్యాంగపరమైన ఫ్రాడ్ (మోసం)గా ఆమె అభివర్ణించారు.

3. ఈ యేడాదిలోనే అనూరాధ భాసిన్ ఆర్టికల్ 370, జమ్మూ కశ్మీర్ చరిత్రను తప్పుగా చెబుతూ ఓ పుస్తకాన్ని రాశారు. “ఎ డిస్మాంటల్డ్ స్టేట్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ కాశ్మీర్ ఆఫ్టర్ ఆర్టికల్ 370”,దాని పేరు. తప్పుడు కథనాలను, వేర్పాటువాదాన్ని ప్రచారం చేస్తున్నారంటూ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం దానిని నిషేధించింది.
అందులో ప్రస్తుతం బ్యాన్ చేసిన ఆమె పుస్తకంలో ఆర్టికల్ 370 గురించి ఆమె షాకింగ్ ఆరోపణలు చేశారు. ‘ఈ విషయంలో రెండు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆర్టికల్ 370 మమ్మల్ని భారత్‌లో స్వయంప్రతిపత్తి కలిగిన భాగంగా ఉంచేవి, కానీ ఇప్పుడు మమ్మల్ని భారత్ ఆక్రమించేసింది అనేది ఒక అభిప్రాయం. భారత ప్రజాస్వామ్యంపై పెద్దగా నమ్మకం లేని కశ్మీరీలు ఈ అభిప్రాయంతో ఉన్నారు. ఇక ఆజాదీకి మద్దతిచ్చే వారేమో.. తాము ఎప్పుడూ భారత్‌లో భాగం కాదని, భారత్‌తో ఉన్న ఒకే ఒక న్యాయపరమైన లింకును కూడా ఈ నిర్ణయం తెంచేసిందనేది వాళ్ల వాదన.’ అని ఆమె రాసుకొచ్చారు.

4. 2023 లో అనూరాధ భాసిన్ భారత మీడియా, దాని భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా, ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని విమర్శిస్తూ న్యూయార్క్ టైమ్స్ లో కూడా వ్యాసం రాశారు. మోదీ ప్రభుత్వం మీడియా విషయంలో అణచివేత ధోరణితో వుందని, మీడియా సంస్థలను అణచివేస్తోందంటూ లక్ష్యంగా చేసుకున్నారు.

5. మరీ ముఖ్యంగా అనూరాధ భాసిన్, అనేకానేక భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. పాక్ ISIS తో సంబంధాలను కలిగి వున్నారు. ఆమె తండ్రి వేద్ భాసిన్ కూడా కాశ్మీర్‌లో ISI యొక్క భారత వ్యతిరేక కార్యకలాపాలకు గట్టి మద్దతుదారుడు.భారతదేశం నుండి కాశ్మీర్ విడిపోవాలనే ఆలోచనను ఆయన బహిరంగంగా సమర్థించారు. వేద్ భాసిన్ వేర్పాటువాద సంస్థ జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) తో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు. JKLF వ్యవస్థాపకుడు మక్బూల్ భట్ పట్ల కూడా ఆయన సానుభూతి వ్యక్తం చేశారు.అమెరికాలో ఐఎస్ఐ ఘాతుక నాయకుడు గులాం నబీ ఫైకి వేద్ భాసిన్ సన్నిహిత స్నేహితుడు. జమాతే ఇ ఇస్లామీ కార్యకర్త అయిన ఫై కూడా వేద్ భాసిన్ మరణానంతరం ఆయనను ప్రశంసించాడు కూడా.

6. భాసిన్ తండ్రీకూతుళ్లు ఇద్దరూ ఫై మరియు అతని కాశ్మీర్ అమెరికన్ కౌన్సిల్ (KAC) నిర్వహించిన అనేక ISI-ప్రాయోజిత సమావేశాలలో కూడా పాల్గొన్నారు.

7. 2011లో, కాశ్మీర్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నందుకు ఐఎస్ఐ నుండి డబ్బు అందుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాయికి అనురాధ భాసిన్ మద్దతు ఇచ్చారు. ద్దతు ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు అనుకూలంగా అమెరికా వైఖరిని ప్రభావితం చేయడానికి నిధుల సమీకరణలోనూ వున్నట్లు తెలుస్తోంది.

8.2010 లో అనూరాధ భాసిన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో “కాశ్మీర్‌లో ఆవేశాన్ని రెచ్చగొట్టడం” అనే శీర్షికతో ఓ వ్యాసం రాశారు. అందులో భారత భద్రతా దళాలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. భద్రతా దళాలు కాశ్మీరీ పిల్లలను, యువతను చంపుతున్న వారుగా, అణచివేతదారులుగా చిత్రీకరిస్తూ… తొమ్మిదేళ్ల బాలుడి మరణాన్ని ఉటంకించారు.