News

సేవాఘడ్‌లో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాలు

21views

సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని అనంతపురం జిల్లా  కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ తెలిపారు.  కలెక్టర్‌ను  కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌ఎంటీ) సభ్యులు కలిసి 287వ జయంతి మహోత్సవాలకు అధికారికంగా ఆహ్వానించారు. అనంతరం జయంతి మహోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరఫున మహోత్సవాలకు అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. భక్తులు, బంజారా సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.

సేవాఘడ్‌లో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాలు

 గుత్తికి సమీపంలో సేవాఘడ్‌లో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాలు ఈనెల 13, 14, 15 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. గురువారం ఎస్పీ జగదీష్‌ చేతుల మీదుగా ఉత్సవాలకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఉత్సవాలకు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు పాలే జయరాంనాయక్‌, వెంకటరమణనాయక్‌, గర్మా మల్లికార్జుననాయక్‌, శివకుమార్‌నాయక్‌, శ్రీనివాస్‌నాయక్‌, ధనుంజయనాయక్‌, చిన్నా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.