
మన భారత దేశం ఒంటి స్తంభం మేడ కాదు, అన్ని కాలాలలో అనేక మంది మహాపురుషులు జన్మించారు. కొందరి జీవితాల్లో, జీవన సందేశాలలో అనేక పోలికలు కనిపిస్తాయి. అలాంటి ఇద్దరు ముహా పురుషుల గురించి తెలుసుకుందాం!
ఆర్.ఎస్.ఎస్ సంస్థాపకులు డా.కేశవరావు బలిరాం హెడ్గేవార్ (డాక్టర్జీ ) 1889 ఉగాది ఏప్రిల్ 1 నాడు నాగపూర్ లో జన్మించారు. శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు 1889, జూలై 2న కృష్ణా జిల్లా పెనుగ్రంచిపోలులో జన్మించారు ఇద్దరివీ మధ్యతరగతి కుటుంబాలే! చిన్ననాటనే తల్లిదండ్రులను కోల్పోయారు గోపాలకృష్ణయ్య. జన్మించిన మూడవ రోజునే తల్లి, మూడవ ఏట తండ్రి ఇద్దరూ తనువు చాలించారు. కేశవరావు 14వ ఏట ప్లేగు వ్యాధి వల్ల 1903 ఫిబ్రవరిలో తల్లిదండ్రులిద్దరూ ఒకే రోజున తనువు చాలించారు.
విద్యా భ్యాసం
కేశవరావు, గోపాలకృష్ణయ్య చిన్ననాట ఇద్దరూ ఆవేశ స్వభావం కలవారే! స్వాతంత్ర్య ఉద్యమాల్లో ఇద్దరూ అగ్రేసరులే! 1905లో ఆంగ్లేయ ప్రభుత్వం బెంగాల్ విభజనను చేసింది. దీనికి నిరననగా వందేమాతర నినాదం బెంగాల్ నుండి దేశమంతటా విస్తరించింది. కేశవ్ నాగపూర్ నీల్స్ హైన్కూల్లో విద్యార్థి. వందేమాతర గీతం పొడరాదంటూ రిస్తే సర్కూలర్ ను ఆంగ్లేయ ప్రభుత్వం విడుదల చేసింది. 1908లో స్కూల్ ఇన్ స్పెక్టర్ రాక సందర్భంగా అన్ని తరగతుల్లో అందరి విద్యార్థులు వందేమాతరంతో ఆంగ్లేయ అధికారికి స్వాగతం చెప్పారు. ఈ ఉద్యమం వెనుక ఎవరు ఉన్నారో తెలియ రాలేదు. ఆరు నెలల స్నూలు మూసివేసిన అనంతరం కేశవు నీల్స్ హైస్కూల్ నుండి బహిష్కరించారు. చిన్ననాటనే కేశవ్ అసాధారణ నాయకత్వ ప్రతిభను చూపారు.
విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని దుగ్గిరాల రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ మెట్ కాష్ హాస్టల్ లో అధ్యాపకునిగా చేరారు. తరగతి గదుల్లో దేశభక్తిని రగుల్కొల్చే వారి ప్రసంగాలు ఆంగ్లేయ అధికారులకు నచ్చలేదు. హాస్టల్ వార్షిక సభలో త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ఫలితం ఆంగ్లేయ ప్రభుత్వం దుగ్గిరాల వారిని ఉద్యోగం నుండి తొలగించింది.
కేశవరావు హైస్కూల్ విద్యార్థిగానే స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు. నాయకత్వం వహించారు. ఉన్నత చదువు పేరున కలకత్తా వెల్లి వైద్యపట్టాను పొందారు. అక్కడ అనుశీలన సమితి అనే విప్లవ సంస్థలో చురుగ్గా పాల్గొన్నారు. ఇద్దరూ చిన్ననాటనే తల్లిదండ్రులను కోల్పోయారు. దుగ్గిరాల వారు ఉన్నత చదువుల కోసం ఇంగ్లండులోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదివారు. అక్కడే స్వాతంత్య్ర ఉద్యకు బీజాలు బలంగా వడ్డాయి.
స్వాతంత్య్ర ఉద్యమంలో…
కలకత్తాలో చదువు అనంతరం 1916లో డాక్టర్జీ నాగపూర్ తిరిగి వచ్చి అన్ని రకాలైన స్వాతంత్య్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మధ్య పరగణాలు (Central Provinces) కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. 1920, డిసెంబరు నాగవూర్ కాంగ్రెస్ జాతీయ మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షణ చేశారు. 1921లో, 1930 లో రెండు సార్లు జైలు శిక్ష అనుభవించారు.
జీవితాంతం బ్రహ్మచారిగా పూర్తి జీవితం దేశం కోసం సమర్పించారు. ఎవరు స్వాతంత్ర్యం కోసం ఏ పద్ధతిలో పని చేసినా వారికి అండగా నిలిచారు.
దుగ్గిరాల వారికి 14 వ ఏటనే, చిన్న నాటనే వివాహం అయింది. రాజమండ్రి,మచిలీపట్టణం కళాశాలలో కొంత కాలం అధ్యా పకులుగా పనిచేశారు. వారు మంచి వక్త. విద్యార్థులలో ఆవేశం, దేశభక్తిని రగిలించే వారి పాఠాలు చెప్పే పద్ధతి అక్కడి వారికి నచ్చలేదు. దాంతో వారు అధ్యాపకత్వం మానుకొన్నారు. 1921 చీరాల-పేరాల ఉద్యమాన్ని నడి పించారు. 1921 విజయవాడ కాంగ్రెస్ జాతీయ మహాసభలో పాల్గొన్నారు. వారి ప్రసంగాలను విని ఆంగ్లేయ ప్రభుత్వం ఒక సంత్సరం జైలు శిక్ష విధించింది. 1922లో తమిళనాడు, తిరుచునాపల్లిలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. 1920లో భారతీయ విద్య ప్రారంభం కోసం విద్యాలక్ష్యం ఏర్పరిచారు. దాతలు 22 ఎకరాలు స్థలం ఇచ్చారు.
1923 నాగవూర్ కాంగ్రెస్ మహా సభల్లో దుగ్గిరాల వారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు.
ఆర్. ఎస్. ఎస్ రామదండు
1920 లో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రామదండు అనే సంస్థను ప్రారంభించారు. అస్పృశ్యత నిర్మూలన, గ్రామస్వయంపాలన. ఇలా 10 అంశాలు లక్ష్యము. ఆంజనేయుడు గల కాషాయ జెండా ఈ సంస్థ జెండా.1921 విజయవాడ కాంగ్రెస్ జాతీయ మహా సభల నిర్వహణలో రామదండు చక్కగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆంధ్రరత్నకు రామదాసు అనే పేరు వచ్చింది.
డాక్టర్జీ 1925లో విజయదశమి నాడు ఆర్.ఎస్.ఎస్ ను ప్రారంభించారు. భారతదేశ సంపూర్ణ స్వాతంత్ర్యము, భారత దేశ సమగ్ర అభివృద్ధి లక్ష్యములు, హిందూ సమైక్యతను సాధనంగా స్వీకరించారు. కాషాయ జెండా ఆర్.ఎస్.ఎస్ స్వయం సేవ కులకు గురువు. జీవితాంతం ఆర్.ఎస్.ఎస్ బలోపేతం కోసమే డాక్టర్జీ పని చేస్తూ కూడా స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఇద్దరు ప్రఖర హిందూ వాదులే!
సామాజిక దృష్టి
ఇద్దరూ హిందూ సమైక్యతను కోరుకున్నారు. కుల అసమానతలను, అస్పృస్య శ్యతను నిర్మూలించాలని కోరుకున్నారు. దుగ్గిరాల వారు జైలు నుండి విడుదల కాగానే 4-10-1922 న మద్రాసు సౌందర్యా హాల్లో జరిగిన సన్మాన సభలో కులవివక్ష అస్పృశ్యత నిర్మూలించబడాలనీ, నేటి కాలానికి అనుగుణంగా నూతన స్మృతి కావాలని కోరుతూ వివరంగా ప్రసంగం చేశారు. 1927లో చీరాలలో రామమందిరం నిర్మించాలని కోరిక వ్యక్తం చేశారు, అనేక మంది ఆర్థిక సహకారం చేస్తాం అన్నారు. ఈ రామమందిరంలో ఎస్సీ లకు కూడా ప్రవేశం ఉంటుంది అని ప్రకటన చేయగానే దాతలు వెనక్కి వెళ్లిపోయారు.. తన భార్య నగలు అమ్మి రామనగరులో ఒక పూరిపాకలో మందిరం ప్రారంభించారు. కొద్ది కాలానికి 1928, జాన్ 10న టి.బి.వల్ల తనువు చాలించారు. వారి కోరిక ఇప్పటికీ నెరవేరలేదు, హిందు వులందరూ సోదరులు, అస్పృశ్యత నిర్మూలన కావాలన్న లక్ష్యము గా సంఘం పని చేస్తోంది. 17, సెప్టెంబరు 1933లో 9 నెలలు అస్పృశ్యత నిర్మూలనకు గాంధీజీ వార్ధా రామ మందిరం నుండి చేరిన హరిజన యాత్రకు సంఘం మద్దతు తెలిపినది.
1934 డిసెంబరులో గాంధీజీ వార్ధా సంఘ శిబిరాన్ని సందర్శించారు. మే 1939 లో డా.అంబేద్కర్ పూనా ఆర్.ఎస్.ఎస్ శిబిరాన్ని సందర్శించారు. కులాలకు అతీతంగా, అస్పృశ్యతకు తావు లేకుండా పని చేయడాన్ని ఇద్దరూ శ్లాఘించారు. 1940, జూన్ 21న డాక్టర్జీ తనువు చాలించారు.
ఎవరు? వీరి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళేది. డాక్టర్జీ గొప్పతనం తన తదనంతరం తన జీవనకార్యాన్ని ముందుకు తీసుకు వెళ్లే కార్యకర్తల గణాన్ని తయారు చేశారు.
ఆర్.ఎస్.ఎస్. వందేళ్ళు పూర్తి చేసుకుంది. దేశ వ్యాప్తంగా గల కార్యకర్తల పరిశ్రములో తన అంతిమ లక్ష్యము వైపు వెళ్తున్నది. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి ఆశయాలు- చీరాలలో అందరికీ ప్రవేశం ఉండే రామాలయ నిర్మాణం, అందరికీ సమానత్వం ఇచ్చే నూతన స్మృతి తయారుచేసి అమలు చేసేది ఎవరు?
-డా.దగ్గుబాటి వెంకటేశ్వరరావు





