
గుజరాత్ లోని సోమనాథ ఆలయం శతాబ్దాలుగా జాతీయ స్ఫూర్తిని ప్రేరేపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమనాథ్ స్వాభిమాన్ వేడుకల్లో భాగంగా సోమనాథ ధామంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. సోమనాథ్ విశ్వాసం, ధైర్యం, ఆత్మగౌరవ అంశాలను ప్రకాశవంతం చేస్తూ, భారతదేశ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు.
సోమనాథ్ స్వాభిమాన పర్వ్ మన దేశపు ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు.సోమనాధ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా విజయవాడ సత్యన్నారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెయ్యి ఏళ్ల క్రితం, 1026లో సోమనాథ్ క్షేత్రంపై మొదలైన వరుస దాడులు ఏవీ కూడా భారతదేశపు ఆత్మస్థైర్యాన్ని, అచంచలమైన విశ్వాసాన్ని లేదా మన నాగరికత యొక్క సంకల్పాన్ని అణచివేయలేకపోయాయన్నారు సోమనాథ్‌పై దాడి చేసిన వారు కాలక్రమేణా చరిత్ర పుటల్లో అదృశ్యమైపోయారు, కానీ సోమనాథ్ క్షేత్రం మాత్రం నేటికీ సగర్వంగా, అత్యున్నతంగా నిలిచి ఉందన్నారు.భారతీయ వారసత్వాన్ని గౌరవిస్తూ, ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.




